

భారత పురుషుల క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ వంటి దిగ్గజ కెప్టెన్లు జట్టు రూపురేఖలను మార్చినట్లే, మహిళల క్రికెట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం కూడా కీలక మార్పులకు కారణమైంది. ఆమె సారథ్యం చేపట్టిన తర్వాత భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లను ధీటుగా ఎదుర్కొనే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ దూకుడైన ఆటతీరును జట్టులోనూ తీసుకురావడంతో టీ20 క్రికెట్‌లో భారత విధానం మారింది. ఫిట్‌నెస్, ఆటగాళ్ల ఎంపిక, కోచింగ్, సహాయక సిబ్బంది, మెరుగైన సౌకర్యాలకు ప్రాధాన్యం పెరగడంతో మహిళల క్రికెట్‌కు బలమైన వ్యవస్థ ఏర్పడింది.
హర్మన్‌ప్రీత్ నాయకత్వ కాలంలో షెఫాలి వర్మ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, నందని శర్మ, స్నేహ్ రాణా, అమన్‌జ్యోత్ కౌర్ వంటి ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. స్మృతి మంధాన, దీప్తి శర్మ వంటి సీనియర్లు కూడా కీలక పాత్ర పోషించారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్, దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో జట్టును విజయపథంలో నడిపించడంలో హర్మన్‌ప్రీత్ నాయకత్వం ప్రత్యేకంగా నిలిచింది. ఆసియా కప్, ఆసియా క్రీడల్లోనూ భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ స్థాయిలో నిరంతర ఆధిపత్యం సాధించాలంటే మరింత నిలకడ అవసరమైనప్పటికీ, హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో వచ్చిన మార్పు మాత్రం తిరుగులేనిది. భవిష్యత్ విజయాలకు బలమైన పునాది వేసిన ఆమె భారత మహిళల క్రికెట్‌పై చెరగని ముద్ర వేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!