

కేరళ క్రికెట్ లీగ్ 2026 ఫైనల్ అనంతరం జరిగిన టైటిల్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో భారత క్రికెటర్ సంజు శాంసన్, మాజీ ఆటగాడు శ్రీశాంత్ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకే రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు క్రికెటర్లు ఎదురుపడినా ఒకరినొకరు పలకరించుకోకపోవడం, కరచాలనం చేసుకోకపోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో సంజు శాంసన్, శ్రీశాంత్ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది.
గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో శ్రీశాంత్.. సంజు శాంసన్‌పై చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులేనని వాదిస్తున్న మరికొందరు.. గతంలో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఫైనల్ ప్రజెంటేషన్ సమయంలో ఇద్దరూ ఎందుకు అలా వ్యవహరించారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు అసలు కారణం ఏమిటన్నది మాత్రం సంజు లేదా శ్రీశాంత్ స్పందిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!