

అజింక్య రహానే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త సారథి ఎంపికపై చర్చ మొదలైంది. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి జట్టుకు కొత్త నాయకుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉండటంతో భారత యువ బ్యాటర్ రింకు సింగ్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే కేకేఆర్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రింకు.. తాజాగా యూపీటీ20 లీగ్‌లో మేరఠ్ మావెరిక్స్‌కు సారథ్యం వహించి టైటిల్ అందించాడు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు రింకు ఎంపిక కాకపోవడంతో యూపీటీ20 లీగ్‌లో మావెరిక్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు.
ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో మేరఠ్ మావెరిక్స్.. లఖ్‌నవూ ఫాల్కన్స్‌ను 94 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది. ప్రత్యర్థి జట్టుకు అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఫైనల్లో రింకు బ్యాటర్‌గా విఫలమైనప్పటికీ.. కెప్టెన్‌గా మాత్రం జట్టును విజయపథంలో నడిపించాడు. టోర్నీలో మావెరిక్స్ 10 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది. తాజా ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన రింకు.. 2018లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 73 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. దీంతో వచ్చే సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్సీని రింకుకు అప్పగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!