
రాజకీయాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 58 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ అజేయంగా 73 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోర్ నమోదు చేసింది.
223 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. భువనేశ్వర్ కుమార్ ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ వికెట్లు తీసి ఒత్తిడి పెంచాడు. కూపర్ కొన్నొల్లీ 37, సూర్యాన్ష్ షెడ్గే 35 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. శశాంక్ సింగ్ 56 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. రసిక్ దార్ మూడు వికెట్లు తీసి ఆర్సీబీ విజయానికి కీలకంగా నిలిచాడు. ఈ ఓటమితో పంజాబ్‌కు వరుసగా ఆరో పరాజయం ఎదురైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!