

విజయ్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. విజయ్ చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ దేవోల్ కీలక పాత్రల్లో నటించారు. సెన్సార్ సంబంధిత కారణాలతో విడుదల వాయిదా పడిన ఈ చిత్రం జులై 23న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఆగస్ట్ 21 నుంచి జీ5 వేదికగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే.. వెట్రి కొండాన్ పాత్రలో విజయ్ జైలు జీవితం అనంతరం బయటకు వస్తాడు. జైలు అధికారి ప్రమాదంలో మరణించడంతో ఆయన కుమార్తె విజ్జి బాధ్యతను వెట్రి తీసుకుంటాడు. ఆమెను ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దుతూ సైన్యంలో చేరేందుకు శిక్షణ ఇస్తుంటాడు. ఈ క్రమంలో బాబీ దేవోల్ పోషించిన జాన్ హిమ్లర్ విజ్జిని లక్ష్యంగా చేసుకోవడంతో కథలో కీలక మలుపులు చోటుచేసుకుంటాయి. విజ్జిని ఎందుకు టార్గెట్ చేశాడు? వెట్రి అతడిని ఎలా ఎదుర్కొన్నాడు? రాజకీయ నాయకుడు రోజా రంగస్వామితో హిమ్లర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తాజా నివేదికలు రూ.320 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదైనట్లు పేర్కొంటున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!