
రాజకీయాలు

వన్డే సిరీస్ కోసం ఇటీవల భారత్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్ జట్టు మరోసారి భారత పర్యటనకు రానుంది. సెప్టెంబర్‌లో టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్థాన్ తలపడనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
మూడు టీ20 మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. వరుసగా మూడు రోజులకు కాకుండా రెండు రోజుల వ్యవధిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌తో ఇరుజట్లు మరోసారి పొట్టి ఫార్మాట్‌లో తలపడనుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!