

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సి తండ్రి జార్జ్ మెస్సి ఇటీవల 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణంతో మెస్సి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తాజాగా తొలిసారి తన తండ్రి మరణంపై సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తన తండ్రి తనకు తండ్రిగానే కాకుండా స్నేహితుడు, ప్రతినిధిగా కెరీర్ మొత్తంలో అండగా నిలిచారని మెస్సి గుర్తుచేసుకున్నారు.
తండ్రి లేకుండా తాను ఎలా కొనసాగాలో తెలియడం లేదని, ఫుట్‌బాల్‌ను ఇంకా ఎక్కువ కాలం కొనసాగిస్తానా అనే విషయంలో తనకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయని మెస్సి వెల్లడించారు. 2026 ప్రపంచకప్‌లో తండ్రి తన ఆటను చూడాలని కోరుకున్నారని, కానీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. మెస్సి పోస్టుపై క్రిస్టియానో రొనాల్డో స్పందిస్తూ.. ఈ క్లిష్ట సమయంలో మెస్సి, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని కోరారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!