

యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండో టెస్టులోనూ అదే కథ మ్యాచ్‌ను బాగానే ప్రారంభించినా తర్వాత పట్టు విడిచిన ఇంగ్లండ్ మరో ఘోర ఓటమి వైపు దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 177 పరుగుల భారీ ఆధిక్యం ఇచ్చేసిన ఇంగ్లండ్, రెండో ఇన్నింగ్స్‌లో తీవ్రంగా కుదేలైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 134/6 తో నిలిచింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఇంకా 43 పరుగులు చేయాల్సి ఉంది.
మిచెల్ స్టార్క్ (2/48), మైకేల్ నీసర్ (2/27), స్కాట్ బోలాండ్ (2/33) ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను ధ్వంసం చేశారు. ఓపెనర్ జాక్ క్రాలీ (44) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్ ఈసారి కేవలం 15 పరుగులే చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (4*) తో కలిసి విల్ జాక్స్ (4*) క్రీజులో ఉన్నాడు.
అంతకుముందు 378/6 తో రెండో రోజు ముగించిన ఆస్ట్రేలియా, అనూహ్యంగా 511 పరుగులు చేసి ఆలౌటైంది. బంతితో 6 వికెట్లు తీసిన స్టార్క్, బ్యాటుతోనూ రాటుదేలాడు — 141 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు). ఇది అతని టెస్టు కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. నీసర్ (16), బోలాండ్ (21), డాగెట్ (13) సహకారంతో స్కోరు 500 దాటింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!