

రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత పోరులో రాయల్ఛాలెంజర్స్బెంగళూరు జట్టు, కోల్‌కతానైట్‌రైడర్స్ పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్నవిరాట్కోహ్లీ ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు.

మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అంగ్రిష్ రఘువంశీ 44 బంతుల్లో 71 పరుగులతో మెరిపించగా, చివర్లో రింకూ సింగ్ 21 బంతుల్లో 49* పరుగులతో వేగంగా ఆడాడు.
అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కోహ్లీ 62 బంతుల్లో 105* పరుగులతో చెలరేగగా, దేవదత్ పడిక్కల్ 39 పరుగులతో కీలక సహకారం అందించాడు. చివరి ఓవర్లలో కోహ్లీ కొట్టిన బౌండరీలు మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు మళ్లించాయి. ఈ సెంచరీతో కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా తన రికార్డును మరింత బలపరిచాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!