

భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే టెస్టు జట్టులో యువ ఆటగాళ్ల కంటే సీనియర్ ఆటగాళ్లే ఎక్కువ మంది ఉండాలని అభిప్రాయపడ్డాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రహానే, భారత టెస్టు జట్టు మళ్లీ పూర్వ వైభవం సాధించాలంటే అనుభవజ్ఞులైన ఆటగాళ్ల పాత్ర ఎంతో కీలకమని చెప్పాడు. టెస్టు క్రికెట్‌లో ప్రతి సెషన్‌ను పట్టుదలతో ఆడే మనస్తత్వం ఆటగాళ్లలో పెరగాలని ఆయన సూచించాడు.
ఒకేసారి పలువురు సీనియర్ ఆటగాళ్లు రిటైర్ కావడంతో భారత జట్టులో అనుభవం తగ్గిపోయిందని రహానే ఆందోళన వ్యక్తం చేశాడు. తన అభిప్రాయం ప్రకారం టెస్టు జట్టులో ఏడు నుంచి ఎనిమిది మంది సీనియర్లు, ఇద్దరు లేదా ముగ్గురు యువ ఆటగాళ్లు ఉండాలని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై తనకు ఆందోళన ఉందని చెబుతూ, భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ ఫార్మాట్‌ను కాపాడాల్సిన బాధ్యత అందరిదని తెలిపాడు. ప్రస్తుతం భారత జట్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే 50కి పైగా టెస్టులు ఆడిన అనుభవం కలిగిన ఆటగాళ్లు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!