

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేశ్‌బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మాండకినిగా, పృథ్వీరాజ్ కుంభగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ, పాత్రలు, టైమ్ ట్రావెల్ అంశాలపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఓ వైరల్ ట్వీట్ ద్వారా చక్కర్లు కొడుతున్నాయి.
వైరల్ అవుతున్న ప్రచారం ప్రకారం.. రుద్ర పాత్రకు, అతడి తండ్రికి మధ్య ఉన్న భావోద్వేగ బంధం కథలో కీలకంగా ఉంటుందని, ఫస్ట్ హాఫ్‌లో తండ్రి–కొడుకుల సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయని పేర్కొంటున్నారు. అలాగే ఇంటర్వెల్‌లో రుద్ర రాముడి తరహా రూపంలో విల్లు, బాణంతో కనిపించే భారీ సన్నివేశం ఉంటుందని, క్లైమాక్స్‌లో రుద్ర–కుంభ మధ్య యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలను చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు. ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!