

సినిమా నేపథ్యం లేకుండానే మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్.. ప్రస్తుతం సౌత్‌లో వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్‌గా మారింది. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కయాదు.. హీరోయిన్‌గా మారకముందు తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, చేసిన ఉద్యోగాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
పుణెలో పుట్టి పెరిగిన కయాదు.. చిన్నప్పటి నుంచే నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లు, డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. కుటుంబానికి అండగా నిలిచేందుకు కాఫీ షాప్‌లో టీలు అందించే పనితో పాటు బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేసినట్లు తెలిపింది. కొంతకాలం ఐటీ కంపెనీలోనూ ఉద్యోగం చేసినప్పటికీ, పని ఒత్తిడి తనకు సరిపోకపోవడంతో ఓ దశలో ఆఫీసులోనే కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలి మోడలింగ్ వైపు అడుగులు వేసి సినిమాల్లోకి వచ్చింది. శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ (2022)తో టాలీవుడ్‌లో పరిచయమైన కయాదు.. ‘డ్రాగన్’ (2025) విజయంతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ‘ఫంకీ’, ‘పళ్ళి చట్టంబి’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!