

బిగ్ బాస్ తెలుగు 10లో రెండో వారంలో ఎలిమినేట్ అయిన కృష్ణుడు ఈ సీజన్‌లో తొలి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. హోస్ట్ శివాజీ తనదైన శైలిలో పంచ్‌లతో ఇంటర్వ్యూను ప్రారంభించి.. కృష్ణుడి గేమ్, హౌస్‌లో అతడి ప్రవర్తన, ముందుగానే ఎలిమినేట్ కావడానికి కారణాలపై ప్రశ్నలు సంధించారు. తాను ఇంత త్వరగా బయటకు వస్తానని ఊహించలేదని కృష్ణుడు చెప్పాడు. స్వీట్స్ పూర్తిగా మానేయలేకపోవడం కూడా తన గేమ్‌పై ప్రభావం చూపిందని తెలిపాడు. హౌస్‌లో ఉన్నప్పుడు తలనొప్పి రావడంతో వైద్యులు పరీక్షించి, స్వీట్స్‌ను ఒక్కసారిగా మానేయకుండా క్రమంగా తగ్గించుకోవాలని సూచించారని వెల్లడించాడు. త్రిగుణ్ ప్రభావంతోనే తాను గొంతు పెంచాడనే ప్రశ్నకు.. త్రిగుణ్ మాట్లాడమని మాత్రమే చెప్పాడని, తాను ఇచ్చిన వార్నింగ్‌లు, చేసిన వ్యాఖ్యలు తనవేనని స్పష్టం చేశాడు.
ఇక హౌస్‌లోని పలువురు కంటెస్టెంట్ల ఆటపై కూడా కృష్ణుడు తన అభిప్రాయాలను పంచుకున్నాడు. బిగ్ బాస్ గేమ్‌కు త్రిగుణ్ బాగా సరిపోతాడని, ఎలా ఆడాలో అతడికి స్పష్టత ఉందని చెప్పాడు. అమన్ అండర్‌డాగ్‌గా ఉన్నప్పటికీ రేసులో కొనసాగుతాడని పేర్కొన్నాడు. రోహిత్ ప్లానింగ్‌తో ఆడుతున్నాడని, విన్నర్ రేసులో బలమైన పోటీదారుడిగా నిలిచే అవకాశం ఉందని అన్నాడు. నరేష్ టైమింగ్‌ను, టాస్కుల్లో అతడి ప్రదర్శనను ప్రశంసించాడు. ముకేష్ కూడా మంచి ఆటగాడేనని, వర్షిణి-ముకేష్, సుధీర్-సృష్టి మధ్య హౌస్‌లో ట్రాక్‌లు కొనసాగుతున్నాయని చెప్పాడు. చివరగా తన అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు అని, ఇప్పటికే ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఉండటంతో తనకు ఆ పేరు ఇష్టం లేకపోయిందని.. తన స్నేహితుడు ‘కృష్ణుడు’ అని పిలవడంతో అదే పేరు కొనసాగిందని వివరించాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!