21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

Writer: Chandrika 10:05 AM, 21 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 114 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలి వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో 49 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసింది. ఆమె ఖాతాలో మూడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. స్మృతి మంధాన 19 బంతుల్లో 37, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 40 పరుగులతో రాణించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి షెఫాలి తన తొలి అంతర్జాతీయ వైట్‌బాల్ శతకాన్ని పూర్తి చేసింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలవలేకపోయింది. 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. దిలారా అక్తర్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, నందని శర్మ చెరో మూడు వికెట్లు తీయగా.. శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టింది. మరో సెమీఫైనల్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో స్వర్ణ పతకం కోసం భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 37 పరుగులు చేసిన స్మృతి మంధాన మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 4,788 పరుగులకు చేరుకుంది. ఈ క్రమంలో సుజీ బేట్స్‌ను అధిగమించి ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత మహిళల క్రికెట్భారత్ వర్సెస్ బంగ్లాదేశ్షెఫాలి వర్మషెఫాలి వర్మ శతకంస్మృతి మంధానహర్మన్‌ప్రీత్ కౌర్ఆసియా క్రీడల క్రికెట్భారత క్రికెట్ జట్టుమహిళల క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’
రాజకీయాలు

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌
సినిమాలు

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!
సినిమాలు

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌
జనరల్

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!
జనరల్

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్
జనరల్

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..
జనరల్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!