

మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో సబ్సిడీ నిధుల విడుదలకు సంబంధించి లంచం డిమాండ్ చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అధికారి అనురాగ్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సస్పెండ్ చేయించారు. గిడ్డంగుల నిర్వాహకుల నుంచి లంచం కోరినట్లు అధికారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదు కేంద్ర మంత్రికి చేరడంతో ఆయన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
నివేదికల ప్రకారం.. ఒక గిడ్డంగి నుంచి రూ.1 లక్ష, మరో గిడ్డంగి నుంచి రూ.60 వేల చొప్పున సబ్సిడీ నిధుల విడుదలకు సంబంధించి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే అధికారిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు సమాచారం. రైతులకు సంబంధించిన పథకాలు, సబ్సిడీల విషయంలో పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర వ్యవసాయ శాఖ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ చర్య చోటుచేసుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!