

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన అమరావతి.. రాయలసీమ జెన్ స్టార్స్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమరావతి 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రంగలక్ష్మి 44 బంతుల్లో 50 పరుగులు చేయగా, దీక్ష కాట్రగడ్డ 22 బంతుల్లో 48 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ నీరగట్టు అనూష 46 పరుగులతో రాణించింది. రంగలక్ష్మి, అనూష తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. లక్ష్య ఛేదనలో రాయలసీమ ఒక దశలో 123/3తో పటిష్ఠ స్థితిలో ఉన్నప్పటికీ.. సాయి పూజిత హ్యాట్రిక్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పింది. టోర్నీలో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. దేవిక కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాయలసీమ 9 వికెట్లకు 156 పరుగులకే పరిమితమైంది. దీక్ష ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది.
మరో మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ 10 పరుగుల తేడాతో వైజాగ్ ఫైర్ బర్డ్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులు చేసింది. హెర్నీటా ఫ్లవియా పెరీరా 46 బంతుల్లో 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. వైజాగ్ బౌలర్లలో సాయి తన్మయి, రిషిక కృష్ణన్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో వైజాగ్ ఫైర్ బర్డ్స్‌కు సరయు, ఆయేషా సింగ్ చెరో 34 పరుగులతో పోరాడినా.. గోదావరి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!