

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాకు సెప్టెంబర్ 23 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాగా, చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. సుమారు 2 గంటల 49 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆయా షేర్’, ‘ఏషనాగుల’ పాటలకు స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈరోజు హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి హాజరైతే ఈ వేడుకకు మరింత ప్రత్యేకత చేకూరే అవకాశం ఉంది. మరోవైపు ప్రీ-రిలీజ్ ఈవెంట్ అనంతరం నాని దాదాపు 10 వేల మంది అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని, వారి కోసం వెజ్, నాన్-వెజ్ వంటకాలతో ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నాని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!