

‘మైసా’ సినిమా కోసం తాను ఎన్నో సవాళ్లు, రిస్క్‌లను ఎదుర్కొన్నానని రష్మిక తెలిపారు. తాజాగా నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ఎత్తులంటే చాలా భయమని, అయినప్పటికీ కథలో రియాలిటీ కోసం కష్టమైన సన్నివేశాల్లో నటించానని చెప్పారు. ఓ సన్నివేశం కోసం దర్శకుడు తనను ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి దూకమన్నారని, ఆ సమయంలో భయంతో వణికిపోయానని రష్మిక గుర్తుచేసుకున్నారు. ప్రతిరోజూ షూటింగ్‌కు వెళ్లే ముందు ఆ రోజు ఎలాంటి రిస్క్ చేయాల్సి వస్తుందోనని భయపడేదాన్నని చెప్పారు.
దర్శకుడి కథకు ప్రాణం పోయడానికి ఎంత కష్టమైనా, ఎలాంటి సవాలు ఎదురైనా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉంటానని రష్మిక పేర్కొన్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ‘మైసా’లో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ విడుదల కార్యక్రమంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!