
రాజకీయాలు

భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ తో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ - చిరాగ్ థాయ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన రెండో రౌండ్లో ఆరో సీడ్ సింధు డెన్మార్క్‌కు చెందిన అమలి షుల్జ్‌పై 21-13, 21-15 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించింది. ఏడో సీడ్ లక్ష్యసేన్ కూడా చైనాకు చెందిన జు జువాన్ చెన్పై 21-12, 21-13తో సునాయాసంగా గెలిచాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్-చిరాగ్ జోడీ మలేసియాకు చెందిన జెర్మీ గూంటింగ్-మహ్మద్ హైకాల్ జంటను 21-12, 21-19తో ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది. అయితే కిడాంబి శ్రీకాంత్ కు నిరాశ ఎదురైంది. చైనీస్ తైపీకి చెందిన సు లి యంగ్ చేతిలో 16-21, 21-11, 8-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దేవిక సిహాగ్, మాళవిక బన్సోడ్ కూడా తమ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!