

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 246 పరుగులకే ఆలౌటైంది. దీంతో ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 356 పరుగుల కంటే 110 పరుగులు వెనుకబడింది. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటంతో 88 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆకాశ్ దీప్ 29, కేఎల్ రాహుల్ 25, రిషభ్ పంత్ 23 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్ నాలుగు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఒక దశలో 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను జురెల్ కింది వరుస బ్యాటర్ల సహకారంతో 246 పరుగుల వరకు తీసుకెళ్లాడు. అయినప్పటికీ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని తగ్గించడంలో భారత జట్టు విఫలమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!