

భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో టీ20లతో పాటు అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగే సామర్థ్యం వైభవ్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. సూర్యవంశీ తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లను తాను ఇంతకుముందు చూడలేదని పేర్కొన్నాడు. అతడి బ్యాటింగ్‌లో కనిపించే నిలకడ, తక్కువ ఎత్తులో వచ్చే బంతులను సైతం సిక్సర్లుగా మలిచే సామర్థ్యం అద్భుతమని కొనియాడాడు. టీ20 క్రికెట్ ప్రపంచాన్ని వైభవ్ తుపానులా చుట్టేశాడని, ప్రపంచంలోని అతిపెద్ద ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో ఒకటైన ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన అసాధారణమని ప్రశంసించాడు.
ప్రతి తరంలోనూ చిన్నారులకు స్ఫూర్తినిచ్చే క్రికెటర్ ఒకరు అవసరమని అలిస్టర్ కుక్ పేర్కొన్నాడు. వైభవ్ అన్ని ఫార్మాట్లలోనూ రాణించి అలాంటి ఆదర్శ ఆటగాడిగా ఎదిగితే టెస్ట్ క్రికెట్‌కు కూడా గొప్ప ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. వైట్ బాల్ క్రికెట్‌తో పాటు రెడ్ బాల్ క్రికెట్‌లోనూ అతడు ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాగా, ఇటీవల జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!