

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను, భారీ మొత్తంలో సరుకులను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తోంది. మారుమూల ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు భారీ ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగా పర్వతాలు, కొండలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను దాటుకుంటూ సొరంగాలను నిర్మిస్తోంది. ఈ జాబితా ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన టన్నెల్ టీ-50 దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగం. 12.775 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం ఖారీ, సుంబర్ ప్రాంతాలను కలుపుతోంది.
దేశంలోని అత్యంత పొడవైన 10 రైల్వే సొరంగాల్లో పీర్ పంజాల్ సొరంగం (11.215 కి.మీ), టన్నెల్ టీ-44 (11.130 కి.మీ), టీ-49 (10.178 కి.మీ), టీ-42 (9.316 కి.మీ), టీ-52 (8.610 కి.మీ), ఆంధ్రప్రదేశ్‌లోని రాపూరు సొరంగం (6.642 కి.మీ), మహారాష్ట్రలోని కర్బుడే సొరంగం (6.506 కి.మీ), టీ-43 (6.292 కి.మీ), టీ-36 (5.941 కి.మీ) ఉన్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాపూరు సొరంగం ఏడో స్థానంలో నిలవడం విశేషం. పర్వత ప్రాంతాల్లో రైల్వే మార్గాలను నిర్మించడం ఎంతటి సవాలుతో కూడుకున్నదో ఈ సొరంగాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!