

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులైన బి. అజిత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బేగంపేటలోని మెట్రో రైల్ భవన్‌లో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు హెచ్ఎంఆర్ఎల్ అదనపు ఎండీగా పనిచేసిన ఆయనను ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
ఐడీఈఎస్ అధికారిగా ఉన్న అజిత్ రెడ్డి ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు మెట్రో సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తానని ఆయన తెలిపారు. మెట్రో రైల్ వ్యవస్థ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అజిత్ రెడ్డిని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు కలిసి అభినందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!