
రాజకీయాలు

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నవంబర్ 30, సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సూచించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు ఉదయం 10:30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.
గిరిజనులు తమ సమస్యలు, ఇబ్బందులకు సంబంధించిన వివరాలను లిఖితపూర్వక ఫిర్యాదుల రూపంలో సమర్పించాలని బి. రాహుల్ కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు సమయానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!