
జనరల్

ఒస్లో చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్పై 8వ రౌండ్‌లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 50వ ఎత్తులో గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఓటమితో కార్ల్‌సన్ 9 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయాడు. డి గుకేష్ అలీరెజా ఫిరౌజా చేతిలో ఓడి 8 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు. వెస్లీ సో 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మహిళల విభాగంలో కోనేరు హంపి అర్మగెడాన్‌లో అన్నా ముజిచుక్‌పై గెలిచినా 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. దివ్య దేశ్‌ముఖ్ బిబిసారా అస్సౌబయేవా చేతిలో ఓడి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. బిబిసారా 15.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!