

ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న భారత యువ క్రీడాకారిణి అనాహత్ సింగ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అనాహత్ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొంటూ, భారత స్క్వాష్ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎక్స్ వేదికగా ప్రధాని ప్రశంసించారు. ఈ విజయం కొత్తతరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, యువతలో స్క్వాష్ క్రీడపై ఆసక్తిని పెంచుతుందని తెలిపారు.
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన రుకాయా సాలెమ్‌ను ఓడించిన అనాహత్, ఈ టోర్నీలో వరుసగా రెండోసారి పతకం సాధించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున పాల్గొన్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన ఆమె, 2023 నుంచి వరుసగా మూడు సంవత్సరాలు సీనియర్ జాతీయ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో స్క్వాష్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించడమే తన లక్ష్యమని అనాహత్ తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!