10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

Writer: Chandrika 02:58 PM, 10 సెప్టెంబర్, 2026
మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు నాకౌట్‌ పోరుకు సిద్ధమైంది. లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన.. గురువారం తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ స్పష్టమైన ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ.. దుబాయ్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఆడాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ విభాగంలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం భారత్‌కు సవాలుగా మారొచ్చు.

టోర్నీలో ఇప్పటివరకు స్పిన్నర్లదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. భారత స్పిన్‌ త్రయం శ్రీచరణి, దీప్తి శర్మ, ప్రేమ రావత్‌ మూడు మ్యాచ్‌ల్లో కలిపి 20 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. షెఫాలి వర్మ కూడా పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌గా ఉపయోగపడుతోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో కెప్టెన్‌ నిగర్‌ సుల్తానాతో పాటు శోభన, షోర్నాపై ఆధారపడుతోంది. నహిదా, మారుఫా, రబేయా వంటి బౌలర్లు భారత బ్యాటర్లకు పరీక్ష పెట్టే అవకాశం ఉంది. భారత్‌ పేస్‌ విభాగంలో క్రాంతి గౌడ్‌, నందని శర్మ నిలకడగా రాణిస్తున్నారు. అయితే భారత బ్యాటింగ్‌లో మాత్రం నిలకడలేమి ఆందోళన కలిగిస్తోంది. స్మృతి మంధాన, షెఫాలి వర్మ ఒక్కో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించినా.. ప్రతీక రావల్‌, హర్మన్‌ప్రీత్‌, రిచా ఘోష్‌ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన రాలేదు. ఓపెనర్లు విఫలమైతే మిడిలార్డర్‌ బాధ్యత తీసుకోవడం కీలకం కానుంది.

దుబాయ్‌ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో.. స్పిన్నర్లను ఏ జట్టు మెరుగ్గా ఉపయోగించుకుంటుందన్నదే మ్యాచ్‌ ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చు. బంగ్లాదేశ్‌పై భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 24 టీ20ల్లో తలపడగా.. భారత్‌ 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఓటమిపాలైంది. మరోవైపు భారత ఓపెనర్‌ స్మృతి మంధాన మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడానికి మరో 69 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ బ్యాటర్‌ సుజీ బేట్స్‌ 4,758 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. మంధాన రెండో స్థానంలో కొనసాగుతోంది.

అంచనా తుది జట్లు

భారత్‌: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, ప్రతీక రావల్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్‌, భార్తీ, దీప్తి శర్మ, ప్రేమ రావత్‌, క్రాంతి గౌడ్‌, శ్రీచరణి, నందని శర్మ.

బంగ్లాదేశ్‌: జువారియా, నిగర్‌ సుల్తానా (కెప్టెన్‌), శోభన, దిలారా, షోర్నా, రబేయా, షర్మిన్‌, నహిదా, సుల్తానా, మారుఫా, ఫహిమా.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

ట్యాగ్లు
మహిళల ఆసియా కప్భారత మహిళల జట్టుబంగ్లాదేశ్ మహిళల జట్టుభారత్ వర్సెస్ బంగ్లాదేశ్హర్మన్‌ప్రీత్ కౌర్స్మృతి మంధానదీప్తి శర్మషెఫాలి వర్మమహిళల క్రికెట్ఆసియా కప్ సెమీఫైనల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?
టెక్నాలజీ

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..
క్రీడలు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం
రాజకీయాలు

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి
జనరల్

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి
సినిమాలు

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు
జనరల్

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు
బిజినెస్

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..
క్రీడలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!