

యూఎస్ ఓపెన్ 2026లో రెండు బిలియనీర్ కుటుంబాలకు చెందిన అమెరికా టెన్నిస్ స్టార్లు జెస్సికా పెగులా, ఎమ్మా నవారో మధ్య ఆసక్తికర క్వార్టర్ ఫైనల్ పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో పెగులా 3-6, 6-4, 6-3 తేడాతో నవారోపై విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇద్దరూ సంపన్న కుటుంబాలకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణులు కావడంతో ఈ పోరుపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇరువురి కుటుంబాల సంయుక్త సంపద 15 బిలియన్ డాలర్లకుపైగా ఉంటుందని అంచనా.
జెస్సికా పెగులా అమెరికా బిలియనీర్ టెర్రీ పెగులా కుమార్తె. ఆయన ఎన్‌ఎఫ్‌ఎల్ బఫెలో బిల్స్, ఎన్‌హెచ్‌ఎల్ బఫెలో సాబర్స్ జట్లకు యజమాని. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం పెగులా కుటుంబ సంపద సుమారు 11.8 బిలియన్ డాలర్లు. ఎమ్మా నవారో షెర్మన్ ఫైనాన్షియల్ గ్రూప్ వ్యవస్థాపకుడు బెన్ నవారో కుమార్తె. ఆమె కుటుంబ సంపద సుమారు 3.2 బిలియన్ డాలర్లుగా అంచనా. తొలి సెట్‌ను నవారో గెలిచినా.. తర్వాతి రెండు సెట్లలో పెగులా ఆధిపత్యం చాటింది. సెమీస్‌లో పెగులా, ఆర్యనా సబలెంకాతో తలపడనుంది. మరో సెమీఫైనల్‌లో కోకో గాఫ్, ఎలెనా రిబాకినా పోటీ పడనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!