10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

Writer: Chandrika 03:00 PM, 10 సెప్టెంబర్, 2026
యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

యూఎస్‌ ఓపెన్‌ 2026లో సంచలనాలకు కొదవ లేకుండా పోయింది. పలువురు స్టార్‌ ఆటగాళ్లు ముందుగానే ఇంటిముఖం పట్టగా.. కొత్త తరం ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలతో దూసుకెళ్తున్నారు. అయితే, టోర్నీ షెడ్యూలింగ్‌ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా నైట్‌ సెషన్‌లో మ్యాచ్‌లు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమవడం, తెల్లవారుజాము వరకు కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. టెన్నిస్‌ దిగ్గజం మార్టినా నవత్రిలోవా కూడా ఈ విధానంపై అసహనం వ్యక్తం చేశారు. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో బరిలోకి దిగిన వెటరన్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. ఆమె మ్యాచ్‌ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమైంది. పురుషుల సింగిల్స్‌లో ఐదు సెట్ల మ్యాచ్‌లు ఉండటంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. కార్లోస్‌ అల్కరాస్‌, బెన్‌ షెల్టన్‌ మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరు రాత్రి 11 గంటల తర్వాత ప్రారంభమై దాదాపు నాలుగున్నర గంటలపాటు సాగి తెల్లవారుజామున 3.34 గంటలకు ముగిసింది. ఆ మ్యాచ్‌ను తాను మేల్కొని చూశానని, అనంతరం తన క్వార్టర్‌ ఫైనల్‌ ఆడాల్సి వచ్చిందని అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ వెల్లడించాడు.

నైట్‌ సెషన్‌ షెడ్యూలింగ్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని నవత్రిలోవా సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. రాత్రి 10 గంటలకు మహిళల మ్యాచ్‌ను ప్రారంభించి, ఆ తర్వాత ఐదు సెట్ల పురుషుల మ్యాచ్‌ను అర్ధరాత్రి సమయంలో మొదలుపెట్టడం ఆటగాళ్లు, ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. యూఎస్‌ ఓపెన్‌లో కీలక మ్యాచ్‌లకు వేదికైన ఆర్థర్‌ యాషె స్టేడియంలో నైట్‌ సెషన్లకు భారీ ఆదరణ ఉంటుంది. ప్రైమ్‌టైమ్‌ కావడంతో ప్రేక్షకులతో పాటు టీవీ వ్యూయర్‌షిప్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, మ్యాచ్‌లు ఆలస్యంగా ప్రారంభమైతే సుదీర్ఘమైన ఐదు సెట్ల పోరులు తెల్లవారుజాము వరకు సాగుతున్నాయి. ఒకే సెషన్‌లో పురుషుల సింగిల్స్‌కు రెండు మ్యాచ్‌లు కేటాయించినప్పుడు రెండో పోరు అర్ధరాత్రి సమయంలో ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా సింగిల్స్‌ మ్యాచ్‌తో పాటు డబుల్స్‌ పోరును నిర్వహించడం వంటి షెడ్యూలింగ్‌ మార్పులను పరిశీలించాలని మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

ట్యాగ్లు
యూఎస్ ఓపెన్ 2026యూఎస్ ఓపెన్ షెడ్యూలింగ్మార్టినా నవత్రిలోవాకార్లోస్ అల్కరాస్బెన్ షెల్టన్వీనస్ విలియమ్స్ఆర్థర్ యాషె స్టేడియంటెన్నిస్టెన్నిస్ వార్తలుగ్రాండ్ స్లామ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?
టెక్నాలజీ

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..
క్రీడలు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం
రాజకీయాలు

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి
జనరల్

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి
సినిమాలు

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు
జనరల్

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు
బిజినెస్

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..
క్రీడలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!