
క్రీడలు

ముంబైలోని వాంఖడే స్టేడియం లో పరుగుల వర్షం కురిసింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణయించిన భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ సులభంగా ఛేదించింది. నికోలస్ పూరన్ 21 బంతుల్లో 63 పరుగులతో విధ్వంసం సృష్టించి లక్నోను 228/5కు చేర్చగా, 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రోహిత్ శర్మ 84, రికెల్టన్ 83 పరుగులతో అద్భుత ఆరంభం అందించారు. వీరిద్దరూ శతక భాగస్వామ్యంతో మ్యాచ్‌ను పూర్తిగా ముంబై వైపు మళ్లించారు.

మొదటి అర్ధ ఇన్నింగ్స్‌లోనే దూకుడుగా ఆడి మ్యాచ్ గమనాన్ని మార్చేశారు. చివర్లో నమన్ ధీర్ 23 నాటౌట్‌తో విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు మిచెల్ మార్ష్ 44, పూరన్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు మార్క్రమ్ (31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్)లు వేగంగా ఆడి లక్నోకు భారీ స్కోర్ అందించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!