
సినిమాలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు సంబంధించిన భూ వ్యవహారాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది “ఫ్యామిలీ రన్.. ఫ్యామిలీ డ్రైవ్ స్కామ్” అంటూ సామాజిక మాధ్యమం వేదికగా ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కొత్త ఆవిష్కరణలు, ఉద్యోగాల సృష్టి ఏమీ లేవని, కేవలం కుటుంబ ప్రయోజనాల కోసమే జరుగుతున్నట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అనుముల సోదరుల్లో ఒక్కరు ఉంటే చాలు.. భూములు దక్కించుకునే అవకాశం ఉందంటూ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన చోట ‘అనుముల హబ్’ ఏర్పడుతోందని విమర్శించారు. భూ వ్యవహారాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


కామెంట్స్ (1)
Both parties are not good blaming each others.