

భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఫీల్డింగ్‌లో కోహ్లీ చూపించే ఎనర్జీ, నిబద్ధత అసాధారణమని పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సెషన్లలో ఎంత ఉత్సాహంగా ఉంటాడో.. మ్యాచ్‌ల్లోనూ అదే తీవ్రతను కొనసాగిస్తాడని తెలిపాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో కవర్స్, షార్ట్ మిడ్ వికెట్ వంటి స్థానాల్లో కోహ్లీ వేగంగా స్పందించడం, డైవ్ చేస్తూ బంతులను అడ్డుకోవడం తనను ఎంతగానో ఆకట్టుకుందని దిలీప్ చెప్పాడు. బంతి తనవైపు రాకపోయినా ఫీల్డింగ్‌లో అతడి చురుకుదనం తగ్గదని పేర్కొన్నాడు.
ఫీల్డింగ్‌లో కోహ్లీ చూపించే తీవ్రత సహచర ఆటగాళ్లపై కూడా ప్రభావం చూపుతుందని దిలీప్ తెలిపాడు. అతడితో కలిసి ఫీల్డింగ్ చేస్తూ తమ సామర్థ్యాలకు మించి రాణించిన ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. తన కోచింగ్ కెరీర్‌లో 2024 టీ20 ప్రపంచకప్ విజయం అత్యంత మధురమైన జ్ఞాపకాల్లో ఒకటని దిలీప్ గుర్తుచేసుకున్నాడు. ఆ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న వాతావరణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!