
జనరల్

తమిళనాడులో నటి త్రిషపై అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తూత్తుకుడిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎంను చేస్తారు?” అంటూ వ్యాఖ్యానించారు. టీవీకే కార్యకర్తలు కావేరి నీటి సమస్యపై కాకుండా తమ ‘వదిన’ త్రిష గురించి గొడవ పడుతున్నారని ఆయన విమర్శించారు.
ఉదయకుమార్ వ్యాఖ్యలపై త్రిష వెల్ఫేర్ అసోసియేషన్, ఆమె అభిమానులు తీవ్రంగా స్పందించారు. మదురైలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. రాజకీయ విమర్శల పేరుతో నటిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!