

ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ పేర్కొన్నారు. ఐపీఎల్ ఆటగాళ్లు భారీ వేతనాలు, అపారమైన క్రేజ్, బ్రాండ్ విలువను పొందుతున్న నేపథ్యంలో బుకీలు ఇచ్చే డబ్బు కోసం వారు తమ కెరీర్‌ను ప్రమాదంలో పడేసే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతటి ఆర్థిక భద్రత కలిగిన ఆటగాళ్లు అక్రమ మార్గాలను ఎంచుకోవడం సులభం కాదని తెలిపారు.
అయితే, సరైన పర్యవేక్షణ లేకుండా నిర్వహించే చిన్నస్థాయి క్రికెట్ లీగ్‌ల్లో అవినీతి, ఫిక్సింగ్ ప్రమాదం ఎక్కువగా ఉందని లలిత్ మోడీ హెచ్చరించారు. మీడియా దృష్టికి దూరంగా జరిగే ఈ టోర్నమెంట్‌లు బుకీలకు అనుకూల వేదికలుగా మారుతున్నాయని ఆరోపించారు. దేశంలో బెట్టింగ్ మార్కెట్ రోజుకు సుమారు రూ.40,000 కోట్ల మేర తిరుగుతోందని పేర్కొంటూ, ఈ భారీ నల్లధన వ్యవస్థ క్రికెట్‌ను లక్ష్యంగా చేసుకుంటోందన్నారు. పెద్ద లీగ్‌లు సురక్షితంగా ఉన్నప్పటికీ, చిన్న లీగ్‌లపై కఠిన పర్యవేక్షణ అవసరమని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!