
జనరల్

నీట్ పీజీ 2026 అభ్యర్థులకు పరీక్ష నగరాల కేటాయింపు పూర్తయిందని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తెలిపింది. అయితే సాంకేతిక సమస్య కారణంగా కొందరు అభ్యర్థులకు తప్పు పరీక్ష నగర వివరాలతో SMSలు వెళ్లినట్లు వెల్లడించింది. ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే సరిదిద్దినట్లు బోర్డు పేర్కొంది.
తప్పు సమాచారం అందుకున్న అభ్యర్థులకు సరైన పరీక్ష నగర వివరాలను SMS, ఈమెయిల్ ద్వారా మళ్లీ పంపినట్లు NBEMS తెలిపింది. అభ్యర్థులు తమ తాజా వివరాలను అధికారిక NBEMS వెబ్‌సైట్‌లోని పోర్టల్‌లో మాత్రమే తనిఖీ చేసుకోవాలని సూచించింది. నకిలీ లేదా అనధికారిక వెబ్‌సైట్లలో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!