
జనరల్

కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ ఎస్‌ఐ వై.వి.వి. సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఈ నెల 10న గుడివాడ పట్టణంలో YSRCP నిర్వహించిన ర్యాలీ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ర్యాలీకి అనుమతి లేదని పేర్కొంటూ మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్‌ఐ సత్యనారాయణ నోటీసు అందించారు.
అయితే పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ కొడాలి నాని పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా YSRCP శిబిరం వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎస్‌ఐ సత్యనారాయణను వీఆర్‌కు పంపుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎస్‌ఐపై తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!