
సినిమాలు

హార్దిక్ పాండ్యా తిరిగి గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఓ నివేదికలో పేర్కొన్నారు. హార్దిక్ రీ-ఎంట్రీ ప్రతిపాదనపై గుజరాత్ టైటాన్స్ కూడా సానుకూలంగా ఉన్నట్లు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. అయితే హార్దిక్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలనే షరతు పెట్టడంతో చర్చలు ముందుకు సాగలేదని తెలుస్తోంది.
మరోవైపు హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలతోనూ చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా, తాను వ్యక్తిగతంగా ఏ ఫ్రాంచైజీని సంప్రదించలేదని హార్దిక్ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో హార్దిక్ భవిష్యత్తుపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!