

గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన IPL 2026 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 168/5 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 61 పరుగులతో ఇన్నింగ్స్‌కు అండగా నిలవగా, వాషింగ్టన్ సుందర్ కేవలం 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. SRH బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు.

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన SRH, చివరకు కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో జట్టు కోలుకోలేకపోయింది. కగిసో రబాడ మూడు వికెట్లతో చెలరేగగా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీసి హైదరాబాద్ పతనాన్ని పూర్తి చేశారు.
ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తమ నెంబర్ 1 స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోగా, హైదరాబాద్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!