

భారత్ వేదికగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027 కోసం ఆస్ట్రేలియా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ, భారత పిచ్‌లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారత్‌కు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడే ఆలోచన లేదని, శిక్షణ శిబిరంలోనే భారత పరిస్థితులను పోలిన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రాణించిన వారిలో భారత్‌లో విజయవంతమయ్యే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లకే తుది జట్టులో అవకాశం కల్పిస్తామని మెక్‌డొనాల్డ్ చెప్పారు. ముఖ్యంగా స్పెషలిస్ట్ ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇస్తామని, బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. 2004-05 తర్వాత భారత్‌లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని గెలవలేకపోయిన ఆస్ట్రేలియా ఈసారి ఆ రికార్డును మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ సిరీస్‌లో భారత్‌కు విజయం అత్యంత కీలకం.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!