
జనరల్

ఫిలిప్పీన్స్ టెన్నిస్ సంచలనం అలెగ్జాండ్రా ఇయాల మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. వింబుల్డన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించిన ఇయాల.. తాజాగా వాషింగ్టన్ డీసీలో జరిగిన ముబదల డీసీ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)పై 4-6, 6-4, 6-0 తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో ఇయాల తన కెరీర్‌లో తొలి డబ్ల్యూటీఏ టూర్ టైటిల్‌ను అందుకుంది. అంతేకాకుండా డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచిన తొలి ఫిలిప్పీన్స్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఫైనల్లో తొలి సెట్ కోల్పోయినా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థిని చిత్తు చేసింది. టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో ఎలినా స్వితోలినా, సెమీఫైనల్లో నవోమి ఒసాకాలను ఓడించి ఇయాల టైటిల్ సాధించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!