
క్రీడలు

ఆసియా క్రీడలు 2026లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ విభాగంలో నీరూ ధండా, కైనన్ చెనై జోడీ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో భారత జోడీ 34 పాయింట్లు సాధించి కొత్త గేమ్స్ రికార్డును నమోదు చేసింది. కతార్ జోడీ 32 పాయింట్లతో రజతం, చైనా జోడీ 23 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాయి.
ఈ విజయంతో భారత్‌కు ఆసియా క్రీడల్లో తొమ్మిదో స్వర్ణ పతకం దక్కింది. అంతేకాకుండా, ఈ ఏడాది ఆసియా క్రీడల్లో ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. నీరూ ధండాకు ఇది వరుసగా రెండో స్వర్ణ పతకం కావడం విశేషం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!