

హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ 2025 పూల్ సిలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో, దినేష్ కార్తీక్ నేతృత్వంలోని భారత జట్టు కేవలం 2 పరుగుల తేడాతో (డీఎల్ఎస్ పద్ధతి) పాకిస్థాన్‌ను ఓడించి టోర్నమెంట్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో ఆ వర్షమే కీలకంగా మారింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, ఆరు ఓవర్లలో 86/4 పరుగులు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది. రాబిన్ ఉతప్ప 11 బంతుల్లోనే ధాటిగా 28 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ మూడు ఓవర్లలో 41/1తో సునాయాసంగా లక్ష్యం దిశగా సాగుతున్న క్రమంలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. దీంతో డీఎల్ఎస్ పద్ధతిని ఉపయోగించి ఫలితాన్ని ప్రకటించారు.
ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ వేసిన కట్టుదిట్టమైన రెండో ఓవరే మ్యాచ్‌కు మలుపు. ఆ ఓవర్లో అతను ఒక వికెట్ తీసి కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. ఈ స్వల్ప విజయం ద్వారా భారత్ గ్రూపులో కీలక ముందడుగు వేయగా, అబ్బాస్ అఫ్రిది నేతృత్వంలోని పాకిస్థాన్ టోర్నమెంట్లో తమ తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.










కామెంట్స్ (1)
భారత జట్టు దుమ్ము రేపింది