
జనరల్

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో ఏకంగా ఏడు స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ బాక్సింగ్ చరిత్రలో ఇదే భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఈ ఘన విజయంతో మొత్తం 39 పతకాలతో భారత్ పతకాల పట్టికలో 10వ స్థానం నుంచి నేరుగా నాలుగో స్థానానికి ఎగబాకి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఈ విజయంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష స్పందిస్తూ దీనిని భారత క్రీడా చరిత్రలో స్వర్ణ దినంగా అభివర్ణించారు. జాతీయ గీతం పలుమార్లు వినిపించిన క్షణాలు గర్వంగా అనిపించాయని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు, వైద్యులు, మానసిక నిపుణులు చేసిన కృషి, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహం ఈ విజయానికి ప్రధాన కారణమని ఆమె కొనియాడారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!