

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. శుక్రవారం జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో అగార్కర్ కొనసాగింపు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరోసారి పొడిగింపు ఇవ్వకుండా కొత్త చీఫ్ సెలక్టర్‌ను నియమించే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉండటంతో కొత్త సెలక్షన్ కమిటీతో సన్నాహాలు ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సమయంలోనే అగార్కర్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ అగార్కర్‌కు పొడిగింపు లభించకపోతే.. తదుపరి చీఫ్ సెలక్టర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారనుంది. మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రజ్ఞాన్ ఓఝా ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉండటంతో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లోనూ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఒడిశాకు చెందిన 40 ఏళ్ల ఓఝా హైదరాబాద్ తరఫున తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. గుజరాత్‌కు చెందిన పార్థివ్ పటేల్ ఐపీఎల్‌లో పలు జట్లకు కోచ్‌గా కూడా పనిచేశాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!