

భారత క్రికెటర్ పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగపూరితమైన ప్రకటన చేస్తూ తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. భవిష్యత్ లక్ష్యాలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న తేడాలను గుర్తించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.
ఒకరిపై ఒకరికి ప్రేమ, శ్రద్ధ, గౌరవం ఉన్నప్పటికీ.. తమ జీవిత ప్రయాణాలు వేర్వేరు దిశల్లో సాగాల్సి ఉందని అర్థం చేసుకున్నట్లు ఆకృతి తన పోస్టులో పేర్కొంది. తమ బాధ్యతలు, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని ఆమె కోరింది. విడిపోవడానికి సంబంధించిన మరిన్ని నిర్దిష్ట కారణాలను ఇద్దరూ బహిరంగంగా వెల్లడించలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!