

బిగ్‌బాస్ తెలుగు 10లో రోజుకో కొత్త ట్విస్ట్‌తో గేమ్ ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులు కొనసాగుతుండగా, తాజాగా విడుదలైన సెప్టెంబర్ 17 ఎపిసోడ్ ప్రోమోలో శాలిని పటేల్‌ను యమకింకరులు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లినట్లు చూపించారు. గార్డెన్ ఏరియాను శ్మశానవాటికలా తీర్చిదిద్ది, సమాధి బాక్సులు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత యమకింకరులు ఎంట్రీ ఇవ్వడం ప్రోమోలో కనిపించింది.
బిగ్‌బాస్ ఆదేశాలతో కంటెస్టెంట్లు గార్డెన్ ఏరియాలోకి చేరుకున్న తర్వాత, ఓ సమాధిపై ఉంచిన లెటర్‌ను శాలిని తీసుకుంది. అనంతరం సమాధి బాక్సుల దగ్గర చోటుచేసుకున్న పరిణామాల్లో యమకింకరులు శాలినిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. దీంతో హౌస్‌మేట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, ముఖేష్, ఝాన్సీతో పాటు శాలిని కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉన్న నేపథ్యంలో ఈ ప్రోమో మరింత ఉత్కంఠను పెంచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!