

ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వ్యక్తిగత పురస్కారాల్లో బాలన్ డి’ఓర్ ఒకటి. 2026 అవార్డు వేడుక అక్టోబర్ 26న లండన్‌లోని లండన్ పల్లాడియం థియేటర్‌లో జరగనుంది. 1956లో ‘ఫ్రాన్స్ ఫుట్‌బాల్’ ప్రారంభించిన ఈ అవార్డును 2024 నుంచి ఫ్రాన్స్ ఫుట్‌బాల్, యూఈఎఫ్‌ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 నామినీల జాబితాలో లియోనెల్ మెస్సితో పాటు లామినె యమాల్, కైలియన్ ఎంబాపె, ఎర్లింగ్ హాలాండ్, విన్సియస్ జూనియర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
బాలన్ డి’ఓర్ విజేతను అంతర్జాతీయ ఫుట్‌బాల్ జర్నలిస్టుల జ్యూరీ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తుంది. ఫిఫా పురుషుల ర్యాంకింగ్స్‌లో టాప్-100 దేశాల నుంచి ఒక్కో జర్నలిస్ట్ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. 30 మంది నామినీల నుంచి ప్రతి ఒక్కరూ టాప్-10 ఆటగాళ్లను ఎంపిక చేసి.. వరుసగా 15, 12, 10, 8, 7, 5, 4, 3, 2, 1 పాయింట్లు కేటాయిస్తారు. అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడే విజేతగా నిలుస్తాడు. వ్యక్తిగత ప్రదర్శన, జట్టు విజయాలు, క్రీడా స్ఫూర్తి, నిష్పక్షపాత ప్రవర్తనను ప్రధానంగా పరిగణిస్తారు. పాయింట్లు సమానమైతే ముందుగా అత్యధిక 15 పాయింట్ల ఓట్లు ఎవరికి వచ్చాయో చూస్తారు. ఆ తర్వాత 12 పాయింట్ల ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!