17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

Writer: Chandrika 11:46 AM, 17 సెప్టెంబర్, 2026
టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

భారత హాకీ జట్టులో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలి ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన, ఆసియా క్రీడల్లో జట్టు అవకాశాలపై మాట్లాడిన ఆయన.. రెండు టోర్నీలు పూర్తిగా భిన్నమైనవని పేర్కొన్నాడు. ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, గత కొన్నేళ్లుగా ఈ టోర్నీలో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పాడు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుందని గుర్తుచేస్తూ.. భవిష్యత్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లను ఇప్పటి నుంచే సీనియర్ జట్టులోకి తీసుకురావాలని సూచించాడు. జూనియర్ స్థాయి నుంచి రాణిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి, సీనియర్ స్థాయి ఆటకు అనుగుణంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌లో భారత్ ఎక్కువ గోల్స్ ఇవ్వడం, లభించిన గోల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం వంటి అంశాలను శ్రీజేష్ ప్రస్తావించాడు. డిఫెన్స్‌తో పాటు ఎటాకింగ్‌లోనూ జట్టు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రత్యర్థి జట్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు అమలు చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అవసరమని చెప్పాడు. యూరప్ జట్లు ఎటాకింగ్‌లో మరింత దూకుడుగా ఉంటాయని, వాటి స్థాయిని అందుకోవాలంటే దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించాడు. కొత్త విధానాల ఫలితాలు వెంటనే కనిపించవని, ఆటగాళ్లు, కోచ్‌లు సమష్టిగా కృషి చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని శ్రీజేష్ పేర్కొన్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

ట్యాగ్లు
పీఆర్ శ్రీజేష్భారత హాకీ జట్టుటీమిండియా హాకీఆసియా క్రీడలు హాకీభారత హాకీహాకీ ప్రపంచకప్భారత క్రీడాకారులుహర్మన్‌ప్రీత్ సింగ్యువ హాకీ ఆటగాళ్లుభారత హాకీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్
క్రీడలు

నేను రోబోను కాదు...విమర్శలు నన్ను ప్రభావితం చేస్తాయి:సంజు శాంసన్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..
క్రీడలు

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌
క్రీడలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...
బిజినెస్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్
రాజకీయాలు

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను
సినిమాలు

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!