

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. నార్వేలోని ఓస్లో వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్‌లో కార్ల్‌సెన్‌పై క్లాసికల్ ఫార్మాట్‌లో రెండో విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. కార్ల్‌సెన్ స్వదేశంలోనే ఈ ఘనత సాధించడం భారత చెస్‌కు గర్వకారణంగా నిలిచింది.
ఇప్పటికే టోర్నమెంట్ మూడో రౌండ్‌లో కార్ల్‌సెన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద్, తాజా పోరులో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాడు. నల్ల పావులతో ఆడిన భారత గ్రాండ్‌మాస్టర్ అద్భుతమైన వ్యూహాలతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. గేమ్ మొత్తం సమయంలో టైమ్ ప్రెషర్‌తో ఇబ్బంది పడ్డ కార్ల్‌సెన్, 48వ ఎత్తులో చేసిన కీలక తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ అవకాశాన్ని వెంటనే వినియోగించుకున్న ప్రజ్ఞానంద్ క్వీన్ దాడితో ఆధిపత్యం చెలాయించి కేవలం రెండు ఎత్తుల్లోనే చారిత్రాత్మక విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!