

బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంఛైజీల యజమానులు నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్న అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్ల సమయంలో జట్టు యజమానులు డగౌట్ సమీపంలో ఉండకూడదు. అలాగే ఆటగాళ్లు, సిబ్బందితో ఎలాంటి సంకేతాలు లేదా మాటల ద్వారా సంప్రదింపులు జరపకూడదు. అయితే కొన్ని ఫ్రాంఛైజీల యజమానులు ఈ మార్గదర్శకాలను పలు సందర్భాల్లో ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.
డగౌట్ సమీపంలో యజమానులు కనిపించిన ఫొటోలు, మైదానంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లిన ఘటనలు బీసీసీఐ దృష్టికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్లో చోటుచేసుకున్న కొన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనల నేపథ్యంలో అవినీతి నిరోధక విభాగం అప్రమత్తమైంది. దీంతో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, జట్టు అధికారుల హోటల్ గదుల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇకపై ఏ అతిథి అయినా ఆటగాళ్ల గదుల్లోకి వెళ్లాలంటే జట్టు మేనేజర్ నుంచి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్సైకియా ఫ్రాంఛైజీలకు లేఖలు రాసినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!